అధికారుల ఆకస్మిక తనిఖీలు
నిర్వరపోయిన అధికారులు
బాపట్ల టౌన్ – కల్తీ ఆహారాలు పెట్టి భోజన ప్రియుల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న పలు రెస్టారెంట్లపై ఆహార కల్తీ నియంత్రణ కమిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు. డీ ఫ్రిడ్జ్ లో ఉన్న ఆహారాన్ని చూసి అధికారులు నివ్వెర పోయారు. బూజు పట్టి ఉన్న మాంసాహారాలను గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నిల్వ ఉంచిన ఆహారాలను రెస్టారెంట్లకు వచ్చిన వారికి వండి పెడతారా అంటూ రెస్టారెంట్ యజమాని పై అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యలంక రహదారిలోని ముత్తయ్యపాలెం సమీపంలోని రిసార్ట్స్ లో బూజు పట్టి ఉన్న మాంసాహారం తోపాటు,కల్తీ ఆహారాలను గుర్తించారు.నిల్వ ఉంచిన నూనె గుర్తించారు. వ్యవసాయ కళాశాల సమీపంలో ఓ రెస్టారెంట్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించారు.ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని డంపింగ్ యార్డులకు తరలించారు.అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెస్టారెంట్లపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదుచేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను భోజన ప్రియులకు అందిస్తూ వారి అనారోగ్యానికి కారణం అవుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని అనుమతులతో,నిబంధనలు పాటించి మంచి ఆహారం ను ప్రజలకు అందించాలని,లేకుంటే రెస్టారెంట్లలను సీజ్ చేస్తామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో డిఇఇ మాల్యాద్రి,టిపిఓ శ్రీలక్ష్మీ,ఆర్ఐ సురేష్,రూరల్ యస్ఐ కిరణ్,సానిటరీ ఇన్స్ పెక్టర్ కొండయ్య,రాం భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.