Wednesday, November 20, 2024

ఇదేనా ఆదర్శ పంచాయతీ?

అధ్వానంగా పారిశుధ్యం పనులు
మురికి కూపాలు గా దళితవాడలు
కరోనా ప్రబలుతున్న వేళ పారిశుద్ధ్య కార్మికులను తొలగింపు
ఆర్థిక సంఘం నిధులు ఉన్నా అభివృద్ధి వైపు చూడని పాలకవర్గం
ఏ పని కావాలన్నా సర్పంచిని అడగమంటున్న సిబ్బంది

చెరుకుపల్లి – గుళ్ల‌ప‌ల్లి… అది మండలంలోని మేజర్ పంచాయతీల్లో ఒకటి. గుళ్ల‌ప‌ల్లి గ్రామ జనాభా 12వేల‌ పైచిలుకు. పంచాయితీకి సరిపడా నిధులు ఉన్నా ఇంత వరకు ప్రజోప కరమైన పనులు చేపట్టక పోగా పంచాయితీకి పొదుపు చేసే ఉద్దేశ్యం ఏమో తెలియదు గానీ సర్పంచిగా పదవీ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఉన్న పారిశుద్ధ్య కార్మికుల లో సగం మందికి పైగా ఉద్వాసన పలికారు. దీనితో గ్రామంలోని పారిశుద్ధ్య పనులు అధ్వానంగా తయారయ్యాయి గ్రామంలో ఎక్కువ భాగం జాతీయ రహదారి వెంట ఉండటంతో చిరు వ్యాపారస్తులు రోడ్డుకిరువైపులా దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనోపాధి సాగిస్తుంటారు రోజు వాళ్లు వేసే వ్యర్థాలు కూడా సరిగా తొలగించటం లేదు కరోనా మహమ్మారి కబళిస్తున్న గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయా అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నప్పటికీ ఈ గ్రామంలో మాత్రం ఆ సూచనలు పట్టించుకున్న దాఖలాలు లేవుఓవైపు మండలం లో కరోనా కరాళ నృత్యం చేస్తుంటే గ్రామంలో ఎక్కడబడితే అక్కడ మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రసాద్ ఎదురుగా ఉన్న మురికి కాలువ పొంగి రోడ్ల పైకి నీరు చేరి దుర్వాసన వస్తున్నప్పటికీ ఇంతవరకు దానిని తొలగించిన సిబ్బంది లేరు నిత్యం రద్దీగా ఉండే కోటి సెంటర్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామం లో ఉన్న రెండు దళితవాడలో మురుగు నీటి సౌకర్యం లేక ఇళ్లలో వాడుకున్న నీటిని రోడ్లపైకి వదులుతున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు ప్రజా ప్రతినిధులు గాని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దాఖలాలు లేవు కొత్త పాలక వర్గం పదవి చేపట్టి కొద్ది రోజులు అవుతున్నప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించకపోవడం దురదృష్ట కరమని ప్రజలు వాపోతున్నారు ఈ గ్రామానికి మరో విశేషం ఏమిటంటే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దీనదయాళ్ అవార్డును జిల్లాలో ఈ గ్రామానికి లభించింది నిర్మల్ భారత్ అభియాన్ కింద గ్రామాలలో నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించడం పారిశుద్ధ్య పనులు సక్రమంగా అమలు పరచటం ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం తదితర విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ గ్రామానికి అవార్డు వరించింది గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాలు ప్రత్యేక అధికారుల పాలనలో పరిపాలన సాగింది ఆ సమయంలోనే వారు చేసిన కృషికి ఈ అవార్డు లభించిందని మండల అధికారులు వీరిని ప్రశంసించారు ఈ అవార్డు ప్రకటించిన కొద్దిరోజులకే గ్రామం పారిశుద్ధ్య నిర్వహణలో వెనకబడి పోవటం విచారకరం అంటున్నారు స్వచ్ఛభారత్ లో భాగంగా అప్పటిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన కార్మికులను ఇప్పుడు విధుల్లో నుంచి తొలగించారు అయితే వారికి రావలసిన బాకీలు మాత్రం పంచాయితీ అధికారులు ఎంత వరకు చెల్లించకపోవడం దారుణమని ఆ కార్మికులు వాపోతున్నారు కూలినాలి చేసుకునే దళితుల మైన మాకు ఇన్ని నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు స్థానిక హరిజనవాడలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రాథమిక పాఠశాలను తొలగించారు అక్కడ చదువుతున్న విద్యార్థులను వేరే పాఠశాలకు బదిలీ చేసినప్పటికీ దూరంగా ఉన్న అక్కడికి వెళ్ళేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు నిరాకరించడంతో అద్దె భవనంలో పాఠశాల నిర్వహిస్తున్నారు ఇంకా రోడ్డుకిరువైపులా ఉన్న టిఫిన్ సెంటర్లు హోటల్ వారు వేసే వ్యర్థాలను పంచాయతీ సిబ్బంది ని తొలగించవద్దు అని నూతన సర్పంచి ఆదేశాలు జారీ చేశారని మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవని వారు ఆవేదన చెందుతున్నారు గ్రామ స్వరాజ్య స్థాపన కొరకై గతంలోని పెద్దలు పంచాయతీ వ్యవస్థ స్థాపించి పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు పాలకవర్గాలను ఏర్పాటు చేశారు కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా గ్రామాలు కూడా పార్టీల ఊబిలో కూరుకుపోయి స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు ఏ ఒక్కరికి లేకపోవటం విచారకరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు ప్రజా సమస్యలపై దృష్టిసారించి వాటిని పరిష్కరించిన నాడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు

  • తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను త్వరలోనే విధుల్లోకి తీసుకుంటాం .14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతి లో ఉన్నాయి స్వచ్ఛభారత్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పంచాయతీ నుంచి బిల్లులు పెట్టాము . అవి నేరుగా వారి ఖాతాలో జమ అవుతాయి . మీకు ఏదైనా వివరాలు కావాలంటే సర్పంచ్ ని అడగండి – షేక్ షాహినా బేగం గ్రామ పంచాయతీ కార్యదర్శి గుళ్ల పల్లి
Advertisement

తాజా వార్తలు

Advertisement