Friday, November 22, 2024

జియో వినియోగదారుల కష్టాలు

చెరుకుపల్లి – సెల్ఫోన్ రంగంలో సంచలనం సృష్టిస్తూ ప్రారంభించిన అనతికాలంలోనే ఎంతో మంది వినియోగదారులు సంపాదించిన జి ఓ సంస్థ ఇప్పుడు వారి బలహీనతతో ఆడుకుంటుంది ఎన్నో నెట్వర్క్ కంపెనీలు మార్కెట్లో దొరుకుతున్నప్పటికీ జి యోసంస్థ ప్రకటించే ఆఫర్లకు ఆకర్షితులైన ప్రజలు వేరే నెట్వర్క్ల నుండి జియోకు మారారు ముఖ్యంగా వేరే నెట్వర్క్ల నుండి జియో కంపెనీ కి మారే వినియోగదారులకు మంచి మంచి ఆఫర్లను ప్రకటించి ఎక్కువ శాతం ప్రజలను తమ సంస్థల వైపు తిప్పుకున్నారు ముఖ్యంగా మండలంలో లెక్కకు మించి జియో కు వినియోగదారులు ఉండటంతో ఆ సంస్థ తమ టవర్ల సామర్థ్యం చాలక వినియోగదారులు పలు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది ముఖ్యంగా సాయంత్రం సమయంలో జియో వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతం తమ నెట్వర్క్ నుండి జంపింగ్ కాల్స్ కాల్ చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం నెట్ వినియోగించే వారైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఇదేమని జయోషాపు యజమానులను అడిగితే సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతున్నాం సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది అని చెబుతున్నారే తప్ప గత నెల రోజుల పైగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఆకర్షించేందుకు ప్రకటించడం తో తమ పని అయిపోయింది అన్న సంస్థ వినియోగదారులను పట్టించుకోకపోవడం విచారకరమని ప్రజలు వాపోతున్నారు జియోసిమ్ ఎందుకు వాడుతున్నాము రా భగవంతుడా అని ప్రజలు అనుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఎంతో పెద్ద నెట్వర్క్ కలిగిన జియోసంస్థకు గ్రామీణ ప్రాంత ప్రజల ఇబ్బందులు పట్టకపోవచ్చు కానీ ఈ ప్రాంతంలో పనిచేసే ఆ సంస్థ ప్రతినిధులు వినియోగదారుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement