Saturday, November 23, 2024

ఎపిలో రేప‌టి నుంచి రాత్రి క‌ర్ఫ్యూ…..

అమ‌రావ‌తి – ఎపిలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేప‌థ్యంలో రేప‌టి నుంచి ఎపి అంతటా రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు.. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు..కొవిడ్ పై మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం జ‌గ‌న్ రాత్రి క‌ర్ప్యూ విధించే విష‌యాన్ని ప్ర‌క‌టించారు..రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఎపిలోని అన్ని వ‌ర్త‌క ,వాణిజ్య స‌ముదాయాలు, మాల్స్, జిమ్స్, రెస్టారెంట్స్,సినిమా థియేట‌ర్స్, విద్యా సంస్థ‌లు, అన్ని రాత్రి తొమ్మిది లోపు మూసివేయాల‌ని కోరారు..జిల్లాల‌లో ఉన్న ప‌రిస్థితులు ఆధారంగా స‌మ‌యాల‌ను మార్చే అధికారం క‌లెక్ట‌ర్లు అప్ప‌గించారు.. ఇక ఇది ఇలా ఉంటే మే ఒక‌టో తేది నుంచి ఎపిలోని 18 – 45 మ‌ధ్య వ‌య‌స్కులంద‌రికీ ఉచితంగా క‌రోనా టీకా వేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు..
ఏపీలో 18-45 మధ్య వయసువారు 2,04,70,364 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఈ క‌రోనా వ్యాక్సినేష‌న్ గురించి మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, 45 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌, ఉచిత వ్యాక్సిన్‌ కోసం రూ.1600 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. అలాగే ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ లో వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement