అమరావతి – ఎపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. నీలం సాహ్ని పేరును గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు ప్రధాన కార్యదర్శి గా ఎపి ప్రభుత్వంలో పని చేసి పదవీ విరమణ పొందిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని కొనసాగుతున్నారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించిన సంగతి తెలిసిందే..
అందులోని నీలం సాహ్ని పేరును గవర్నర్ ఆమోది స్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది ఆ వెంటనే నీలం సాహ్ని ఎస్ ఈ సి గా బాధ్యతలు స్వీకరించనున్నారు