అమరావతి – : కరోనా దృష్ట్యా ఈ నెల 21న జరిగే శ్రీరామ నవమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. అదేవిధంగా ఆలయాల్లో ఉత్సవాలు, గ్రామాల్లో జాతరలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని తెలిపారు. హరిద్వార్ కుంభమేళాలో విశాఖ శారదాపీఠం చేపట్టిన అన్న ప్రసాద వితరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 50 రోజులుగా వేలాదిమంది భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసినట్లు చెప్పారు. నాగ బాబాలు, సాధువులు, అఖాడాలకు కుంభమేళా సమయంలో సేవలందించినట్లు స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు