Tuesday, November 26, 2024

పెదనందిపాడు జాతీయ సైన్స్ మాస ఉత్సవాలు

పెదనందిపాడు,ప్రభాన్యూస్, తేది:19 ఫిబ్రవరి 2023 శాస్త్రీయ ఆలోచన విధానాన్ని మన నిత్య జీవన దృక్పధంగా అలవర్చుకుందాం. శాస్త్ర విజ్ఞాన ఫలితాలను, శాస్త, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం నిత్యం ఉపయోగించుకున్నట్లుగా శాస్త్రీయ ఆలోచన విధానాన్ని మన నిత్య జీవన తాత్విక దృక్పధంగా అలవర్చుకుందామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోటా వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ సైన్స్ మాస ఉత్సవాలు సందర్భంగా జనవిజ్ఞాన వేదిక , పెదనందిపాడు ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు శాఖా గ్రంధాలయం పెదనందిపాడు నందు జాతీయ సైన్స్ మాస ఉత్సవాలను మరియు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ జయంతిని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకురాలు పి సుభాషిని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో అనేక మంది శాస్త్రవేత్తలు సైన్స్ అభివృద్ధికి విశేష కృషి చేశారని చార్లెస్ డార్విన్, నికోలస్ కోపర్నికస్, సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలు ఫిబ్రవరి నెలలో జన్మించారని, అందువలన ఫిబ్రవరి నెలలో జాతీయ సైన్స్ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టియూ జిల్లా అధ్యక్షులు గేరా మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాస్త్రీయ భావజాలం పెంపొందే విధంగా గ్రంథాలయాలను అధ్యయనం చేయాలని సూచించారు. సామాన్య ప్రజలలో మూడాచారాలను తొలగించి శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రదాలయ నిర్వహకురాలు పి సుభాషిని, ఎస్ టి యు నాయకులు గేరా మోహనరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు ఎన్ రామకృష్ణ, జె కోటేశ్వరరావు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఫోటో: సమావేశంలో మాట్లాడుతున్న కోట వెంకటేశ్వర రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement