Wednesday, November 20, 2024

ప్రాణ త్యాగాలు వ‌ద్దు… విశాఖ కార్మికుల‌కు లోకేష్ విన‌తి…

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ కోసం కార్మికులు ప్రాణ త్యాగాలు చేసే నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దంటూ టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విజ్ఞ‌ప్తి చేశారు.. స్టీల్ ప్లాంట్ కోసం తానే మొద‌టి స‌మిథ‌ను అవుతానంటూ స్టీల్ ప్లాంట్ కార్మికుడు శ్రీనివాస‌రావు విడుద‌ల చేసిన సూసైడ్ నోట్ పై లోకేష్ స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఏం చేసేందుకైనా టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తాము పోరాడతామన్నారు. ఇప్పటికైనా కార్మిక కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనను జగన్ రెడ్డి అర్థం చేసుకొని మౌనం వీడి. ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement