Saturday, November 23, 2024

ర‌ఘ‌రామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు – స్పీక‌ర్ కు నందిగం విన‌తి..

అమ‌రావ‌తి – వేల కోట్ల రూపాయలు దోచుకుతిన్న రఘురామ కృష్ణంరాజు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, ఇలాంటి వ్యక్తులను రాజకీయాల్లో ఉండనిస్తే భావితరాలను మోసం చేసివారమవుతామని, తక్షణమే రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ డిమాండ్‌ చేశారు. తాడేప‌ల్లిలోని వైసిపి కేంద్ర‌ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తరఫున అనర్హత వేటుకు నోటీస్‌ ఇచ్చినప్పుడల్లా తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం లేదని, ఏ తప్పు చేయలేదని తలదాచుకుంటున్న రఘురామకృష్ణంరాజు ఈ పిటీషన్‌ ద్వారా లోపల దాక్కున్న బురదపాము ఇవాళ బయటపడిందన్నారు. ఇప్పటికైనా లోక్‌సభ స్పీకర్‌ గమనించి.. రాజ్యాంగ ఉల్లంఘన, పద్ధతి, విధానం లేని రఘురామకృష్ణంరాజుకు బుద్ధి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యుల్‌లో ఉన్న పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ నుంచి అతనిపై అనర్హత వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తులను ఉపేక్షిస్తే భవిష్యత్తులో రాజకీయాలకు ప్రమాదకారిగా మారే అవకాశం ఉందన్నారు. రఘురామ కృష్ణం రాజు మాటలు వైయస్‌ఆర్‌ సీపీ తరఫున వ్యక్తిలా కాకుండా.. పక్క పార్టీలు, వ్యక్తులకు మేలు చేసే విధంగా ఉన్నాయని, వాళ్లకు దాయాదిగా పనిచేస్తున్నాడని ఎంపీ నందిగం సురేష్‌ మండిపడ్డారు. అతనికున్న సీబీఐ, ఏసీబీ కేసుల నుంచి బయటపడే మార్గం కోసం ఆయ‌న‌ టీడీపీ, బీజేపీ భజన చేస్తున్నార‌ని ధ్వజమెత్తారు. ఇన్ని పాపాలు చేస్తున్న రఘురామకృష్ణంరాజును పైనున్న దేవుడు కూడా కాపాడలేడని, జైలు జీవితం గడపడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement