నిజాంపట్నం – ప్రపంచం మొత్తం కరోనాతో విలయతాండవం చేస్తుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు. మండల కేంద్రమైన నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 25 పడకల ఆక్సిజన్ సౌకర్యంతో కోవిడ్ కేర్ సెంటర్ ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు అని వ్యాక్సినేషన్ మరియు ఆక్సిజన్ సప్లయ్ కేంద్ర ప్రభుత్వం కనుసన్నుల్లో మానిటరింగ్ జరగడం వలన ఆలస్యం జరుగుతుంది అని రావటంతో తిరుపతి రుయాలో గోవాలో ఆక్సిజన్ అరగంట ఆలస్యం అయినందున కరోనా బాధితులు చనిపోవడం జరిగిందని ఇటువంటి పరిస్తుతుల్లో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ముందు జాగ్రత్తగా రేపల్లె ఏరియా వైద్యశాలలో20 రోజుల క్రితమే 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ను అలాగే 25 పడకలతో ఆక్సిజన్ సౌకర్యం తో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.రేపల్లె పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వనరులను వినియోగించుకొని తన సొంత నిధులతో 25 పడకల ఆక్సిజన్ కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించటం జరిగిందని బయట ప్రాంతాలకు వెళ్లి ఖర్చులు భరించకుండా వుండే విధంగా ఈ ప్రాంతల్లో ఉన్న కరోనా వ్యాధిగ్రస్తులను కాపాడటానికి అందుబాటులో ఉండే విధంగా కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించటం జరిగిందని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు కరోనా బారిన పడకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డాక్టర్ రవి చౌదరి మోపిదేవి హరినాద్ బాబు నర్రా సుబ్బయ్య ప్రసాదం వాసుదేవ్ మోపిదేవి మార్కండేయులు మోపిదేవి శివ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement