అమరావతి : ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయని , వాటి భర్తీ కోసం ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వార్డు సచివాలయ పోస్టులు మాత్రమే భర్తీ చేసిందని, ఇతర పోస్టులు భర్తీ చేయలేదని ఆగ్రహించారు. అదేవిధంగా నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో 25 వేల ఉపాధ్యాయపోస్టులు ఖాళీగా ఉన్నా, వీటి భర్తీ కోసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ డిమాండ్ల సాధన కోసం డివైఎఫ్‌ఐతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. శాసనమండలిలో కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఉగాది నాటికి వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement