కొల్లిపర : రైతన్నలకు అన్ని విధాలా అండగా వైసిపి ప్రభుత్వం నిలుస్తోందని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మున్నంగి, వల్లభాపురం గ్రామాలలో ఏర్పాటుచేసిన జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా శివ కుమార్ మాట్లాడుతూ పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సదుద్దేశంతో ప్రభుత్వం జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మండలంలో ఇప్పటికే తూములూరు, కొల్లిపర, వల్లభాపురం, మున్నంగి గ్రామాల్లో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చు తున్నారని చెప్పారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని ఆయన ఆశయం మేరకే తనయుడు జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుకు భరోసానిచ్చే కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తహసిల్దార్ నాంచారయ్య ఎంపీడీవో పి శ్రీనివాసులు, ఏవో హుస్సేన్ కార్యదర్శి అలకనంద, సర్పంచ్ వల్లభాపురం నిర్మల, ఉప సర్పంచ్ అవుతూ పోతి రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ ఆరిగ చంద్రశేఖర్ రెడ్డి, డి ఆర్ డి ఎ ఎ పి ఎం కృపా సాగర్ పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement