మంగళగిరి: ఫిబ్రవరి 17 ప్రభ న్యూస్- నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ద లతో జరుపుకోవాలని కోరారు. వారు చేసే ఉప వాస దీక్షతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.శివుని అనుగ్రహంతో ప్రభుత్వ పాలన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అద్భుతంగా అందుతున్నాయని అన్నారు._సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన దిగ్విజయంగా కొనసాగాలని మహా శివుని మనసారా వేడుకొంటున్నానని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement