గుంటూరు – హోం ఐసోలేషన్ లో ఉండే వారు ఇంటి నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనా నుండి బయటపడాలని యం.యల్.ఏ. మహ్మద్ ముస్తఫా కోరారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ని నగర మేయర్ కావటి శివనాగ మనోహర నాయుడు, నగర కమిషనర్ చల్లా అనురాధలతో కలిసి యం.యల్.ఏ. పరిశీలించారు. ఈ సందర్భంగా హోం ఐసోలేషన్ ఉన్నవారితో ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారితో కాల్ సెంటర్ నుండి ఫోన్ లో మాట్లాడుతూ హోం ఐసోలేషన్ లో ఉండేవారికి కిట్ లు అందినాయో లేదో వివరాలు అడిగారు. పాజిటివ్ వచ్చిన వారు మనో ధైర్యం తో ఉండాలన్నారు. కరోన సాదారణ లక్షణాలు ఉన్నవారు ఇంటిలోనే వేరుగా గది ఉంటే స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుల పర్యవేక్షణలో ఇంటిలోనే ఉండి కరోన నుండి బయటపడవచ్చని తెలిపారు. వైద్యులు సూచించిన మందులతో పాటు రెండు పూట్ల ఆవిరి పట్టాలని, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలన్నారు. ఇంటిలో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదన్నారు.
నగర మేయర్ కావటి శివ నాగ మనోహర నాయుడు మాట్లాడుతూ కరోన సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, తగిన భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వినియోగించడం చేయాలని, ముఖ్యమైన అవసరం వస్తే మినహా అనవసరంగా బయట తిరగ వద్దని కోరారు. కమిషనర్ చల్లా అనురాధ మాట్లాడుతూ నగరంలోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కుందులరోడ్ లోని లైబ్రరి, గాంధీ పార్క్ లతో పాటుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి పొందిన కొత్తపేటలోని కొనాక్ ల్యాబ్, అరండల్ పేటలోని మైల్ స్టోన్ ల్యాబ్, ముత్యలరెడ్డి నగర్ లోని మైక్రో ల్యాబ్, కుందుల రోడ్ లోని యోన్టస్ ప్రైవేట్ ల్యాబ్ ల్లో కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పరీక్షాకేంద్ర్రాలు, ప్రభుత్వ గుర్తింపుపొందిన కేంద్రాల్లోనే కరోన పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలాకాకుండా అనధికార పరీక్షా కేంద్రాల్లో కరోన పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయన్నారు. ప్రతి రోజు నగరంలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తింపు వేగంగా చేస్తున్నామని, కొందరు కరోన పరీక్ష సమయంలో తప్పుగా ఫోన్ నంబర్, చిరునామా ఇస్తున్నారన్నారు. దీని వలన కాంటాక్ట్స్ ట్రేసింగ్ ఇబ్బంది అవ్వడంతో పాటు పేషంట్ ఆరోగ్య స్థితి పరిశీలనకు సమస్యలు వస్తున్నాయన్నారు. కనుక ప్రతి ఒక్కరు సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. హోం ఐసోలేషన్ లో ఉండేవారు ఇంటి నుండి బయటకు వస్తే స్థానిక వాలంటీర్ ద్వారా వారిని వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ కి తరలిస్తామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పాజిటివ్ వచ్చిన నివాసాలు, చుట్టుపక్కల ప్రత్యేక పారిశుధ్య పనులు, డిస్ ఇన్ఫెక్షన్ కోసం సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయిస్తున్నామని తెలిపారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.నిరంజన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, సూపరిండెంట్లు బాలాజి బాష, సిరిల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
హోం ఇసోలేషన్ లో ఉన్నవారు బయటకు రావద్దు – ఎమ్మెల్యే ముస్తఫా
Advertisement
తాజా వార్తలు
Advertisement