Monday, November 18, 2024

రాష్ట్రాభివృద్ధికి నిదులివ్వండి…నీతి ఆయోగ్ కి మంత్రి మేక‌పాటి విన‌తి..

అమరావతి/న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మరిన్ని నిధులను కేటాయించాలని, పీఎల్‌ఐ స్కీమ్‌ కింద వైఎస్‌ఆర్‌ కొప్పర్తిలోని ఎలక్ట్రాన్రిక్‌ మానుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ వైట్‌ గూడ్స్‌ రంగంలోని పెట్టు-బడిదారులు, ఆర్థిక వ్యవస్థలను సృష్టించడానికి, ఉత్పత్తిలో సామర్థం పెంచుకోవడానికి తోడ్పాటు అందించాలని నీతిఅయోగ్‌ సిఇఓఅమితాబ్‌ కాంత్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో శుక్రవారం కాంత్‌తో భేటీ అయిన మేకపాటి, ఆంధ్రప్రదేశ్‌ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గతంలోని ఐటీ-ఐఆర్‌ పథకం తరహాలో లేదా అం తకన్న మెరుగైన అవకాశాలు సష్టించేందుకు ఐ.టీ . కాన్సెప్ట్‌ సిటీల స్థాపనకు సాయమం దించాలని కోరారు. ఏపీలో ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమేటివ్‌ -టె-క్నాలజీ ఏర్పాటుకు సాయం కోరారు. ప్రతిపాదిత గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసే 60వేల మంది ఉద్యోగులకు ఐదేళ్ల ఈఎమ్‌ఐ ప్రాతిపదికన రాయితీ కింద ఎలక్ట్రా న్రిక్‌ ద్విచక్ర వాహనాలు అందించడానికి కేంద్ర సహకారం అందిం చాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో సోలార్‌, విండ్‌ విద్యుత్‌ ఆధారిత అత్యాధునిక కెమికల్‌ బ్యాటరీ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు అందించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పచ్చని వాతావరణం చెక్కు చెదరని విధంగా అక్కడ నడిచే వాహలన్నింటినీ ఎలక్ట్రిక్ర్‌ వాహనాలుగా మార్చేందుకు నిధులు అందించాలని, బ్యాటరీలను రీఛార్జ్‌ చేసుకునే విధంగా ఏపీ రాష్ట్రవ్యా ప్తంగా బ్యాటరీలు లేని 2,3 వీలర్‌ తరహా ఎలక్ట్రిక్ర్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్ల ఏర్పాటు-కు సహకరించాలని కోరారు. అవసరమైన రాయితీలపై ప్రయాణీకులను మోసుకువెళ్లే త్రీ వీలర్‌ ఆటోలకు ఎలక్ట్రిక్ర్‌ రెట్రోఫిట్‌ కిట్లను సబ్సిడీపై అందిం చాలని కోరారు. ఏపీఐఐసీ ఎండీ రవీన్‌ కుమార్‌ రెడ్డి, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావన సక్సేనా, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్‌ లంకా తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
విశాఖలో స్టేట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సహకరించండి
విశాఖపట్నంలో స్టేట్‌ డేటా సెంటర్‌ సెంటర్‌ ఏర్పాటు-కు సహకరించాలని, 5జీ టె స్టింగ్‌ ల్యాబ్‌, స్కిల్లిం గ్‌ సెంటర్‌ స్థాపనకు తోడ్పాటును అందిం చాలని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర ప్రసాధ్‌ను రాష్ట్ర పరిశ్ర మల, ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల సేవలను విస్తృతం చేసేలా మొబైల్‌ అప్లికేషన్‌తో పాటు తిరుపతి, విశాఖ, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు- చేయనున్న ఐ.టీ- కాన్సెప్ట్‌ సిటీ-లపైనా వారిద్దరి మధ్య చర్చ జరిగింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మూడో రోజు శుక్రవారం కేంద్ర ఐ.టీ- శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిశారు.కొప్పర్తిలో వైఎస్‌ఆర్‌ ఈఎమ్‌సీ సందర్శనకు రావాల్సిందిగా ఆయనను మేకపాటి ఆహ్వానించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కొప్పర్తిలో ఈఎమ్సీ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ ఈఎమ్‌ సీ కోసం నిధులు విడుదల చేయడంపట్ల కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు రాష్ట్ర ఐ.టీ- శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని ఐ.టీ- పార్కుల ఏర్పాటు-కు చొరవ చూపాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టేట్‌ డేటా సెంటర్‌ స్థాపించాలని కేంద్రమంత్రికి వివరాలతో కూడిన ప్రతిపాదనలు అందజేశారు. మౌలిక సదుపాయాలు, ఈ గవర్నెన్స్‌ సేవలను అందించడకోసం ఏర్పాటు- చేసే ఈ స్టేట్‌ డేటా సెంటర్‌కు రూ.116.75 కోట్ల నిధులవసరమని విన్నవించారు. పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్‌ వంటి ప్రభుత్వ కీలక శాఖలన్నీ ఏపీ సచివా లయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలను అందిస్తున్నాయని,ఇప్పటికే 77శాతం ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అందజేస్తున్నట్లు- వెల్లడిం చారు. సచివాలయాల ద్వారా జరిగే సేవలను ఎప్పటికప్పుడు ఆయా శాఖలు మానిటరింగ్‌ చేసు కునేలా, నివేదికలు తీసుకునేలా యాప్‌ తయారీ చేయడానికి కేంద్ర తోడ్పాటు- కావాలని,గ్రామ, వార్డు సచివాలయాల సేవలను విస్తతం చేసేలా మొబైల్‌ అప్లికేషన్‌ తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం కావాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
సీమలో లాజిస్టిక్‌ పార్కులు
రాయలసీమలోని కొప్పర్తి, ఓర్వకల్‌ ప్రాంతా లలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ ఏర్పాటు-లో కేంద్ర ప్రభుత్వం సహ కరిం చాలని, కేంద్ర పరిశ్ర మల, వాణిజ్య శాఖ కార్య దర్శి అనూప్‌ వదవన్‌కు ఏపి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వినతిపత్రాన్ని అంది ం చారు. పరిశ్రమలకు పెట్టుబడులపై మంత్రి మేకపాటి ఢిల్లీ పర్యటన మూడవ రోజైన శుక్రవారంనాడు ఆయన అనూప్‌ వదవన్‌ను కలసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సహకారం అందించాల్సిందిగా కోరారు. టాయ్‌ పార్కుల స్థాపనకు సహకారం కోరారు. ఇవే అంశాలపై ఇప్పటికే కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కార్యదర్శి దృష్టికి మంత్రి తీసుకువెళ్లారు. ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చిన వోకల్‌ ఫర్‌ లోకల్‌లో భాగంగా ఒక జిల్లా – ఒక వస్తువు కింద 13 జిల్లాల నుంచి 13 రకాల ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించినట్లు- పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి వెల్లడించారు. ప్రతిపాదనలకు అవసరమైన ఆర్థిక సహకారం అందించవలసిందిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి అనూప్‌కి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర పరిశ్రమల శాఖ అధికారులు, ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావన సక్సేనా, ఏపీ పరిశ్రమల శాఖ సలహాదారు లంక శ్రీధర్‌, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement