Wednesday, November 20, 2024

ఎపిలో మెడిక‌ల్ మాఫియా – నల్లబజారులో రెమిడెసివిర్‌

ప్రభుత్వ ధర రూ.3490
బ్లాకలోే ఐతే రూ.50 వేలు
కరోనా బాధితులకు ఇంజక్షన్‌ వేయకుండానే బిల్లులు – అవే ఇంజక్షన్లు బ్లాకలోే విక్రయం
రాష్ట్రవ్యాప్తంగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత
సొమ్ము చేసుకుంటున్న వైద్యసిబ్బంది

అమరావతి, : రాష్ట్రంలో కొత్తగా మెడిసిన్‌ మాఫియా పుట్టుకొ చ్చింది. కరోనా వేళ వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. ఆ ప్రాణాల ను కాపాడే అత్యంత విలువైన రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ను కొంతమంది నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని ప్రైవేట్‌ వైద్యశాలల్లో అయితే కరోనా బాధితులకు ఇంజెక్షన్‌ వేయకుండానే రికార్డుల్లో వేసినట్లు చూపిస్తూ ఆ ఇంజెక్షన్‌ను అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ఈ తరహా దందా ఇటీవల కాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ కొరత కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో కరోనా మరింత ప్రమాదకరంగా మారడం, రోజురోజుకు వైరస్‌ బారినపడే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఇంజెక్షన్‌కు డిమాండ్‌ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది మాఫియాగా ఏర్పడి కరోనా బాధితులను రెండు రకాలుగా దోచుకుంటున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అధికారుల దాడుల్లో కూడా మెడిసిన్‌ మాఫియా దందా వెలుగు చూసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే పదింతలు అధికంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారంటే రాష్ట్రం లో రెమిడెసివిర్‌ పేరుతో బాధితులను ఏ స్థాయిలో దోచుకుం టున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆ మెడిసిన్‌ కొరత లేకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కొరతను సృష్టి ంచి ప్రాణాపాయ స్థి తిలో వైద్యశాలల్లో చేరే కరోనా బాధితుల నుంచి ఇంజెక్షన్‌ పేరుతో లక్షలు పిండేస్తున్నారు.

బ్లాక్‌లో అదే ఇంజెక్షన్‌ రూ. 50 వేలు
రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ ధరను ప్రభుత్వం రూ. 3490 లు గా నిర్ణయించింది. గత ఏడాది ఇదే ఇంజెక్షన్‌ రూ. 6500ల వరకు విక్రయించారు. కరోనా బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే ఈ ఇంజెక్షన్‌ మొదట్లో రూ. 10 వేలకు పైగా ధర ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బాధితు లకు అతి ముఖ్యమైన ఈ ఇంజెక్షన్‌ను అందరికీ అందుబాటు లోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ధరను పూర్తిగా తగ్గిం చింది. అయితే సెకండ్‌ వేవ్‌లో కరోనా రోగుల సంఖ్య అమాం తంగా పెరగడంతో రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌కు డిమాండ్‌ పెరి గింది. రోగులకు అవసరమైన ఇంజెక్షన్ల ను ఉత్పత్తి చేయడం లో కొంత జాప్యం జరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వైద్య సిబ్బంది దందా మొదలుపెట్టారు. కృత్రి మ కొరతను సృష్టి ంచి రూ. 3490ల ధర ఉన్న ఇంజెక్షన్‌ను అవసరాన్ని బట్టి రూ. 50 వేల వరకు విక్రయిస్తున్నారు.

అదెలా సాధ్యం
కరోనా రోగులకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ అతి ముఖ్య మైనది. వారిలో ప్రమాద తీవ్రతను బట్టి ఇంజెక్షన్‌ను 6 విడతలుగా అందించాలి. అందుకోసం ప్రభుత్వం కొన్ని వైద్యశాలలకు, ఏజెన్సీలకు అనుమతులిచ్చింది. ప్రభుత్వం గుర్తింపు పొందిన వారి వద్ద మాత్రమే ఇంజెక్షన్‌ అందుబాటు లో ఉంటుంది. సాధారణ మెడికల్‌ షాపుల్లో, వైద్యశాలల్లో ఆ ఇంజెక్షన్‌ ఎట్టి పరిస్థి తుల్లోను లభించదు. దీంతో కొంతమంది వైద్య సిబ్బంది ఆయా వైద్యశాలల్లో కరోనా చికిత్స నిమిత్తం చేరే బాధితులకు ఆరుసార్లు ఇవ్వాల్సిన ఇంజెక్షన్‌ను కేవలం మూడునాలుగు సార్లు మాత్రమే ఇచ్చి మిగిలిన రెండు ఇంజెక్షన్ల ను ఏజెంట్ల ద్వారా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. డిమాండ్‌ ఉన్న సందర్భంలో వారే స్వయంగా పలానా ఏజెంట్‌ వద్దకు వెళితే ఇంజెక్షన్‌ అందుబాటులో ఉందని, అందుకు సంబంధించిన అడ్రసు కూడా చెబుతారు. దీంతో ప్రాణాపాయ స్థి తిలో ఉన్న బాధితుడిని కాపాడుకోవడానికి కుటుంబసభ్యులు డబ్బుకు వెనుకాడకుండా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు చెల్లించి ఇంజెక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ ఇంజెక్షన్‌ను కూడా వైద్య సిబ్బంది బాధితుడికి ఇవ్వకుండా వారి ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు. ఈ తరహా దందా గడిచిన రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తోంది.

వెలుగు చూసిందిలా..
కరోనా వైరస్‌ బారి నుండి బయటపడేసే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ బ్లాక్‌ మార్కెట్లో విక్రయాలపై అందిన సమాచారం మేరకు నెల్లూరు సంతపేట పోలీసులు విచారణకు రంగంలోకి దిగారు. దీంతో తీగలాడితే డొంక కదిలింది. నగరంలోని పద్మావతి ఆసుపత్రిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కరోనా వైరస్‌ సోకిన రోగులకు ప్రాణాపాయ స్థి తిలో వినియోగించే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌కు ప్రభుత్వం రూ. 3490లుగా ధరను నిర్ధారించింది. అయితే కొంతమంది ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకు లు, వైద్య సిబ్బంది ఆ ఇంజెక్షన్‌కు డిమాండ్‌ పెరగడంతో బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయించడం మొదలుపెట్టారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ. 30 వేల నుండి రూ. 50 వేలకు కూడా విక్రయించడం మొదలుపెట్టారు. దీనిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రాజేశ్వర్‌రెడ్డి తమ బృందంతో రంగంలోకి దిగి ఇంజెక్షన్‌ బ్లాక్‌ మార్కెట్‌పై ఆరాతీశారు. నగరానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఇంజెక్షన్‌ను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడని ఆరాతీసి కోవిడ్‌ రోగుల్లాగా ఆ వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించారు. ఫోన్‌ చేసింది విజిలెన్స్‌ అధికారులని తెలియని ఆ వ్యక్తి ఇంజెక్షన్‌ ధర రూ. 40 వేలు అని చెప్పి 18 ఇంజెక్షన్లు ఒక్కో ఇంజెక్షన్‌కు రూ. 25 వేలు చొప్పున రూ. 4.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఇంజెక్షన్లు అందించి నగదు తీసుకునేందుకు వెళ్లిన రామకృష్ణ ను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా.. పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే తరహాలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా అధికారులు దాడులు చేయగా.. బ్లాక్‌ మార్కెట్లో విక్రయాలు వాస్తవమేనని వెలుగు చూసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement