Monday, September 23, 2024

AP | మస్తాన్ సాయి అరెస్ట్.. ప‌లు డ్ర‌గ్స్ కేసుల్లో లింకులు

డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అనే వ్య‌క్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్‌ డ్రగ్స్‌ కేసులో…. ఇటీవల ఢిల్లి నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటు లావణ్యకు మస్తాన్ సాయి డ్రగ్స్ సరఫరా చేసేవాడని రాజ్ తరుణ్ ఆరోపించాడు.

అయితే అప్పటి నుంచి ఈ మస్తాన్ సాయి అదృశ్యమయ్యాడు. కాగా, పలు డ్రగ్స్ కేసుల్లో మస్తాన్ సాయి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గుంటూరులోని ఓ దర్గాలో తలదాచుకున్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు తరలించి విచారణ జరుపుతున్నారు.

అలాగే, మస్తాన్ సాయి ఫోనులో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మస్తాన్ సాయి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులో వివరాలను పరిశీలించారు. మస్తాన్ సాయి ఫోన్ లో చాలా మంది అమ్మాయి ల ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు గుర్తింంచారు. పలువురు అమ్మాయిలు ప్రయివేటు వీడియోలు చిత్రకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించారు.ఏపీ , తెలంగాణా కి చెందిన అమ్మాయిలను టార్గెట్ గా చేసుకొని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement