పల్నాడు జిల్లా నరసరావుపేటలో దీపావళి పర్వదినాన భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాసుల దుకాణంలో ఒక్కసారిగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది దుకాణాలు కాలి బూడిదయ్యాయి. స్థానికంగా ఉండే దుకాణంలో షార్ట్ సర్క్యూట్ రావడంతో పక్కనే ఉన్న దాకాణాలకు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే కూడా ప్రమాద స్థలానికి చేరుకుని కాలిబూడిదైన దుకాణాలను పరిశీలించారు. బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement