Thursday, November 21, 2024

కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలలో మణిపాల్ హస్పిటల్ రికార్డు

తాడేపల్లి,ఫిబ్రవరి24(ప్రభ న్యూస్) ఆంధ్రప్రదేశ్ వైద్యరంగ చరిత్రలో మణిపాల్ హస్పిటల్ విజయవాడ మరో అరుదైన ఘనత సాధించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే అత్యంత క్లిష్టతరమైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా అత్యధిక సంఖ్యలో నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో సుమారు 70కి పైగా ఇలాంటి అరుదైన సర్జరీలను నిర్వహించిన ఏకైక హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ కావడం గమనార్హం. ఇది మాత్రమేకాక మూడేళ్లు, అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు10 కి పైగా విజయవంతంగా నిర్వహించిన ఘనత కూడా మణిపాల్ హాస్పిటల్ దే కావడం విశేషం.


మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్ – ఈయన్టీ, హెడ్ అండ్ నెక్ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డా. వీ. వెంకట కృష్ణ సందీప్, మాట్లాడుతూ,చిన్న పిల్లలకు అతి సున్నితమైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించామని
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సర్జరీలను నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. పిల్లలందరికీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చికిత్సను ఉచితంగా అందించామని . ముఖ్యమంత్రి సహాయ నిధి, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం ద్వారా ఇప్పటి వరకు70 మందికి పైగా పిల్లలు చికిత్స పొందారని వీరందరికి పూర్తిస్థాయిలో చికిత్స పూర్తికాగా,వారందరూ ఇప్పడు మాట్లాడగలుగుతున్నారు అని చెప్పారు.
శ్రీధర్ జాస్తి, ఆడియోలాజిస్ట్ మాట్లాడుతూ, చాలా మంది పిల్లలు పుట్టుకతోనే వినికిడి సమస్యను కలిగి ఉంటారు. ఫలితంగా తాము ఎప్పటికీ మాట్లాడలేమని మానసికంగా ఆందోళన చెందుతుంటారని అలాంటి వారికి మేము పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తామని కాక్లియర్ ఇంప్లాంటేషన్ గురించి వివరించి వారికి అవగాహన కల్పిస్తామని తరువాత ఆ పిల్లలకు మణిపాల్ హాస్పిటల్స్ నుంచి ఉచిత వైద్యం అందిస్తామని . ఇలా మా దగ్గర కాక్లియర్ ఇంప్లాంటేషన్ ను పూర్తి చేసుకున్న పిల్లల్లో వినికిడి సమస్య లేకుండా విని మాట్లాడగలుగుతున్నారని వారి జీవితంలో ఈ సర్జరీ వెలుగులు నింపింది అని చెప్పవచ్చు”అని పేర్కొన్నారు.

మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ “కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ లో మణిపాల్ హాస్పిటల్ మొట్టమొదటి స్థానంలో ఉంది. మా వైద్యులు ఇప్పటివరకు 70 మందికి పైగాపిల్లలకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారమని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఈ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంతో మా హాస్పిటల్ వైద్యులు డా.వి.వెంకటకృష్ణ సందీప్, ఘనత సాధించిన చరిత్రసృష్టించారు.
డా.ఎ.జయకృష్ణ & శ్రీధర్ జాస్తి, ఆడియోలాజిస్ట్ లకు నా హృదయపూర్వక అభినందనలుతెలుపుతున్నాను” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement