గుంటూరు రూరల్ ఫిబ్రవరి 18 (ప్రభాన్యూస్) మహాశివరాత్రి పర్వదినాన, ప్రముఖశైవక్షేత్రం పేరేచర్ల కైలాసగిరి క్షేత్రం వద్ద గుంటూరు రూరల్ మండల జడ్పిటిసి సభ్యులు తుమ్మల సుబ్బారావు ఆధ్వర్యంలో “ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం” నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తుమ్మల సుబ్బారావు పాల్గొని భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, రూరల్ జెడ్పిటిసి తుమ్మల సుబ్బారావు మాట్లాడుతూ బహుళ చతుర్దశి నాడు శివుడు లింగోద్బవుడైన శుభ సమయమే మహా శివరాత్రి పర్వదినమన్నారు.శివనామ స్మరణం సకల పాపహరణమన్నారు. పంచాక్షరి పఠనం శ్రేయోదాయకమన్నారు.శివ పార్వతుల కళ్యాణం లోకానికి శుభాలు అందించడంతో పాటు చక్కని ఆదర్శాన్ని చాటుతుందన్నారు. శివుడు అర్దనారీశ్వరుడని,ఆదర్శ దాంపత్యానికి నిదర్శనమన్నారు.మహాశివరాత్రి నాడు పాటించే జాగరణ నిరంతర చైతన్యానికి సంకేతమన్నారు.శివ పార్వతుల కృపవల్ల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, 2024లో మేకతోటి సుచరిత అత్యధిక మెజార్టీతో గెలవాలని, రూరల్ మండల ప్రజలందరూ సుభిక్షంతో జీవించాలని ఆకాంక్షించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement