Saturday, November 23, 2024

ఆధునికాంధ్ర సాహిత్య నవశకయుగ కర్త శ్రీ శ్రీ…

బాపట్ల – జనం మంచి కోరి.. కష్టాలను ఏరికోరి.. సమత కోసం.. నవత కోసం.. యువత కోసం.. కష్టజీవుల కోసం శ్రీశ్రీ చేసిన శ్రమ పోదు పోదు వృధా.. ఆయన ఆశయాలు ఉంటాయి ప్రతి హృదయాల్లో సదా.. నేడు మహాకవి శ్రీ శ్రీ జయంతి .కష్ట జీవుల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన పీడిత ప్రజల ఆశాజ్యోతి శ్రీ శ్రీ. ఆయన కవితలు వెలుగు బావుటాలు. ఆ జ్వాలలు నిరంతరం మండుతూ, మండిస్తూ ఉంటాయి. సమకాలికులను తట్టిలేపి తుళ్ళి పడేలా చేస్తాయి. అవే మనకు కరదీపికలు. నవసమాజ నిర్మాణానికి మార్గదర్శకాలు. ప్రజల నాలుకలపై నాట్యం చేసే కవిత పంక్తులను తెలుగు జాతికి అందించిన ఘనత శ్రీశ్రీదే. ధర్మ స్థాపన కోసం నవీన మార్గం చూపిన కవిత్వం ఆయనది.దగాపడిన తమ్ముళ్లను, పతితులను భ్రష్టులను, అనాథలను అక్కున చేర్చుకుని వారంతా తీవ్ర ధ్వనిలో విప్లవశంఖం వినిపించాలని శ్రీశ్రీ ఆకాంక్షించారు. పెనునిద్దుర వదిలించే నవ కవితా ప్రభాత భాస్కరుడు శ్రీ శ్రీ. విశ్వసాహిత్యంలో తెలుగు కవిత్వానికి శ్రీ శ్రీ ద్వారానే గుర్తింపు లభించింది. ఆధునికాంధ్ర సాహిత్యంలో శ్రీశ్రీ ఒక నవ శకాన్ని ప్రారంభించి యుగకర్తగా ఖ్యాతి కెక్కారు. సాహిత్యానికి, సామ్యవాదానికి పెళ్లి చేసిన పురోహితుడు శ్రీ శ్రీ. తెలుగు కవితకు అంతర్జాతీయ దృక్పధాన్ని ప్రబోధించారు శ్రీ శ్రీ. 112వ జయంతి సందర్భంగా పలు సాహితీ సంస్థలు ఆయనకు ఘనంగా నివాళులర్పించాయి. .

Advertisement

తాజా వార్తలు

Advertisement