అమరావతి – కర్నూలు, అనంతపురం, విశాఖ, కడప జిల్లాలకు పిడుగులు పడే అవకాశం ఉందని ఎపి విపత్తుల నివారణ శాఖ కమిషనర్ కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలాలకు వెళ్లవద్దని సూచించారు.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలని కోరారు.
పిడుగులు పడే ప్రాంతాలు..
కర్నూలు జిల్లా
కొత్తపల్లె, పగిడ్యాల, జూపాడుబంగ్లా, ఆత్మకూరు, మిడ్తూరు, వేలుగోడు, నందికోట్కూరు, పాణ్యం, ఓర్వకల్లు, బేతంచెర్ల, వేల్దుర్తి, సంజామల, ఔకు, డోన్ , ప్యాపిలి
అనంతపురం జిల్లా
రొద్దం, రామగిరి, కనగానపల్లి, గుంతకల్లు, శింగనమల
విశాఖ జిల్లా
ముంచింగిపుట్టు, అరకులోయ, డుంబ్రిగూడ, పెదబయలు
కడప జిల్లా
మైలవరం, పెద్దముడియం
మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.