Saturday, November 23, 2024

పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి – ఉప సభాపతి కోన రఘుపతి

బాపట్ల – పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు రోడ్డు విస్తరణ కార్యక్రమం ఎంతో ముఖ్యమని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు.గురువారం స్థానిక గడియార స్తంబం వద్ద రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు.పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని పరిశీలించి క్రాస్ రోడ్డు కు కావాల్సిన స్థలాన్ని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ జిల్లా గా ఏర్పడుతున్న బాపట్లకు రహదారుల విస్తరణ ఎంతో ముఖ్యమని విస్తరణ పనులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం నూతనంగా నిర్మించిన రహదారుల కారణంగా కొంత మేర ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయిందన్నారు.చీరాల,బాపట్ల రహదారిలో చెట్టు వద్ద ఏవిధంగా క్రాస్ రోడ్డు నిర్మించామో అదే విధంగా గడియార స్తంబం పక్క నుండి పోస్టు ఆఫీస్ కొంత తొలిగించి క్రాస్ రోడ్డు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.పోస్ట్ ఆఫీస్ ను త్వరలో పూర్తిగా తొలిగించి డిఎస్పీ కార్యాలయం రోడ్డులో నిర్మించి ఇస్తామని చెప్పారు.ఆ ప్రాంతంలో రోడ్డు వెంబడి ఉన్న తోపుడు బండ్లు ను అక్కడ ఏర్పటు చేస్తామని తెలిపారు. రోడ్డు మధ్యలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆవరణలో ఏర్పటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.త్వరలో ఆంజనేయస్వామి గుడి రహదారి విస్తరణ పనులు పూర్తవుతాయని,సుందరంగా రహదారిని తీర్చిదిద్దుతామని వివరించారు.గడియార స్తంబం వద్ద కన్యకపరమేశ్వరి దేవస్థానం వరుకు రోడ్డు విస్తరణకు అధికారులు మార్కింగ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్,టిపిఓ శ్రీలక్ష్మీ,డిఈఈ మాల్యాద్రి,ఏఈ లు శ్రీమన్నారాయణ, సర్వేయర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement