Friday, November 22, 2024

తిరుపతి ఉప ఎన్నిక గెలుపుబిజెపిదే – కన్నా

గుంటూరు సిటీ తిరుపతి లోకసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని విశ్రాంత ఐఏఎస్ అధికారి రత్నప్రభ గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు శుక్రవారం గుంటూరు లోని బ్రాడీపేట లో బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, కేంద్ర కార్మిక శాఖ బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో ధర్మ చలివేంద్ర కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కన్నా లక్ష్మీనారాయణ ధర్మ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లో ఉప ఎన్నికల ప్రచారం చాలా ఉత్సాహంగా జరిగిందన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు తిరుపతికి తరలివచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు . తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లు కూడా బిజెపి అభ్యర్థిని గెలిపించు టకు చూపుతున్న ఉత్సాహాన్ని చూసి వైకాపా , టిడిపి పార్టీ నేతలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి అన్నారు . అందువల్లనే ఇప్పటివరకు జరిగిన స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని తెలుసుకొని భయపడి పోయి ఓటర్లకు లేఖలు రాయడం తానే స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం దీనికి ఇదే నిదర్శనం అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే గతంలో ఉన్న మూడు సీట్లు 4 అవుతాయని అదేవిధంగా వైకాపా అభ్యర్థులు గెలిపిస్తే 21 గా ఉన్న సీట్లు 22 అవుతాయి గాని రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం వీరి గెలుపులు ఉపయోగం పడదని ఓటర్ల గ్రహించారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి మన ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ఎంపీ కూడా లేనందున తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎంపీ నకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల తో పాటు రాష్ట్ర అభివృద్ధికి బిజెపి ఎంపీ ఎంతో సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement