గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడే చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చా.. అయినా సరే మారలేదన్నారు. ఇదే తప్పుకు అమెరికాలో అయితే చంద్రబాబుకి 15 ఏళ్ల శిక్ష పడేదన్నారు. చంద్రబాబు మాకు ఇదేమీ ఖర్మ అంటూ మండిపడ్డారు. ‘చంద్రబాబూ.. ముసలోడివి నీకెందుకయ్యా రాజకీయాలు’.. జగన్‌కి చేతకాకపోతే రాజీనామా చేయాలని.. తాను పరిపాలిస్తాను అన్నారు. డీజీపీ సభలకు అనుమతులు ఎలా ఇస్తారని.. పది వేల మందికి అనుమతి తీసుకుని నలభై యాభై వేల మందిని తరలించారని ఆరోపించారు. అసలు, చట్ట విరుద్దమైన సభలకు ఎలా అనుమతి ఇస్తారో చెప్పాలన్నారు. తాను తప్ప ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ లో చేరే నేతలపైనా కేఏ పాల్ మండిపడ్డారు. డబ్బుల కోసం ఆశపడి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్‌లో చేరుతున్నారని.. ఆంధ్రులను బూతులు తిట్టిన కేసీఆర్ పంచన చేరడం దారుణమన్నారు. రావెల కిషోర్ అవినీతి చక్రవర్తి అని.. తోట చంద్రశేఖర్‌ను కాపు సమాజం వెలి వేయడం ఖాయం అన్నారు. విలువలు లేని రాజకీయాలకు తోట తెరతీశారని వ్యాఖ్యానించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement