Tuesday, November 26, 2024

వాడవాడలా జల శక్తి అభియాన్ ర్యాలీలు

అమరావతి,- నీటిని సంరక్షించి భావితరాలకు నీటి కొరత లేకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని క్రోసూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంపా జ్వాల లక్ష్మీ నరసింహారావు అన్నారు. జల శక్తి అభియాన్ వాన నీటిని ఒడిసి పట్టు ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని గ్రామ పంచాయతీ అధికారులు వాలంటీర్లు అంగన్వాడీ కార్యకర్తల తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది గ్రామంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ నీటి యొక్క ఆవశ్యకత గురించి, సంరక్షణ గురించి వివరించారు నీటిని పొదుపుగా వాడుతూ సంరక్షించాలి అన్నారు .నీటిని వినియోగిస్తూ ఒక్క నీటి చుక్క కూడా వృధా చేయకుండా ఉండాలన్నారు నీటిని ఒక విలువైన వనరుగా పరిగణించాలి అన్నారు నీటిని పొదుపుగా సమర్థవంతంగా ఎలా వినియోగించాలకుటుంబానికి స్నేహితులకు ఇరుగుపొరుగు వారికి తెలియజేయాలన్నారు నీటిని కాపాడుకోవడమే మనం భావితరాలకు ఇచ్చే గొప్ప కానుక అన్నారు నీటి యొక్క ఆవశ్యకత ప్రజలంతా గుర్తెరిగి మసలుకోవాలి అన్నారు .ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో పలు గ్రామాలు పట్టణాలు నీటి కొరత తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలుసన్నారు ఇప్పటి పరిస్థితి ఇలా ఉంటే రాబోయే తరాలకు నీరు ఖరీదైన వస్తువు గా మారే ప్రమాదం ఉందన్నారు .కావున ప్రజలంతా తమ కుటుంబ అవసరాల మేరకు నీటిని పొదుపుగా వాడాలి అన్నారు .అనంతరం ప్రజల చేత నీటి ప్రతిజ్ఞ చేయించారు ఈ గ్రామ సర్పంచ్ వెంపా నాగమణి వాసు, కార్యదర్శి ఈమని శ్రీనివాసరావు, విఆర్వో భువనగిరి శ్రీనివాసరావు, వెంపా పెదపిచ్చయ్య అంగన్వాడీ కార్యకర్తలు వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు.అలాగే మండల పరిధిలోని చావపాడు గ్రామం లో జరిగిన జలశక్తి ర్యాలీలో గ్రామ సర్పంచ్ చిలకా ఆనంద రావు, గ్రామ సచివాలయ పోలీస్ శానంపూడి అర్చన, గ్రామ వైసీపీ నాయకుడు చిలకా సాంబయ్య తదితరులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు . మండల కేంద్రమైన అమరావతి గ్రామ సచివాలయం నందు జరిగిన జలశక్తి అవగాహన సదస్సులో గ్రామ కార్యదర్శి అమిరి నేని మోహన్ చందు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement