అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 7న మంగళవారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. గుంటూరులోని చుట్టు-గుంట సెంటర్ లో ఏర్పాటు చేసిన మెగా మేళాను సందర్శించి డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించనున్నారు. యంత్ర సేవా పథకం ద్వారా లబ్దిపొందిన రైతు గ్రూపులకు సబ్సిడీని కంప్యూటర్ బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉదయం 10.45 – 11.30 గంటల వరకు గుంటూరులో మెగా మేళాలో ప్రదర్శనలను తిలకించిన అనంతరం పల్నాడు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్కళనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడు చేరుకుని జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన హరిత నగరాలు నమూనాని ఆవిష్కరించన్నాను..అనంతరం 12.15 – 12.30 గంటల మధ్య జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్ ను ఆవిష్కరించి, ప్లాంట్ను ప్రారంభిస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని అధికారవర్గాలు వెల్లడించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.