Tuesday, November 26, 2024

మహిళా సాధికారత మా నినాదం కాదు..మా విధానంఃజ‌గ‌న్

అమ‌రావ‌తి – మహిళా సాధికారత అన్నది మా నినాదం కాదని..అది మా విధానమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునర్ఘుటించారు. కోవిడ్‌ కష్ట కాలంలో రాష్ట్రం ఆదాయం సరిగా లేకపోయినా ఇచ్చిన మాట కోసం అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్‌ స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ సొమ్ము రూ.1109 కోట్లును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ వర్చువల్‌ విధానంలో పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడుతూ, మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. మహిళా సాధికారతను ఆచరణలోకి తీసుకురాగలిగామని పేర్కొన్నారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ సొమ్ము వరుసగా రెండో ఏడాది అందజేస్తున్నామని చెప్పారు. రెండో ఏడాది డ్వాక్రా సంఘాలపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోటి రెండు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement