అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 29 లేదా 30 తేదీల్లో ఢిల్లి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే సీఎం జగన్ ఢిల్లి పర్యటన చేపట్టడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం శనివారం ఆయన విశాఖ పర్యటన కూడా రద్దయింది. ఇప్పటికే శుక్రవారం నాటి హైదరాబాద్, పొన్నూరు పర్యటనలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లి పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుతెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఈనెల 30న ఢిల్లి పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. కానీ, అనుకోకుండా ఆయన ఢిల్లి పర్యటనకు అనుకున్న తేదీ కంటే ముందుగానే బయలుదేరి వెళ్తుండటంతో ముఖ్యమంత్రి ఢిల్లిdలో ప్రధానిని కలిసే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముందస్తుకు సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలోనే పలు అంశాలపై సీఎం జగన్ ప్రధాని నుండి స్పష్టమైన హామీకోసం గతంలో వెళ్లిన పర్యటనకు కొనసాగింపు గానే ఈసారి వెళ్లబోతున్నారని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఢిల్లి పర్యటన ఇప్పుడెందుకనేదానిపై పూర్తిస్థాయి లో స్పష్టత లేదు. కానీ, పలు కీలక అంశా లపై ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్ చర్చి ంచే అవకాశం ఉన్నట్లు- మాత్రం తెలుస్తోం ది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
అన్ని టూర్లు రద్దు
వాస్తవానికి సీఎం జగన్ శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరు, అలాగే హైదరాబాద్ లో టూర్లు ప్లాన్ చేసు
కున్నారు. వీటిని అర్ధాంత రంగా రద్దుచేసుకు న్నట్లు- నిన్న రాత్రి ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. దీంతో సీఎం జగన్ ఈ రెండు టూర్లు ఇంత అర్ధాంతరంగా ఎందుకు రద్దు చేసుకు న్నారనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నా యి. ఈ రెండు టూర్లు రద్దు చేసు కున్న సీఎం జగన్ శుక్రవారం ఉదయం మాత్రం క్యాంపు కార్యాలయం లో ఆరోగ్యశాఖపై సమీక్ష జరిపారు. దీంతో మధ్యా హ్నం నుంచి జగన్ ఢిల్లీ పయనం అవుతారని ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా ఆయన తాడేపల్లిలోనే ఉండిపోయారు. ఇదే క్రమంలో శనివారం ఆయన విశాఖ పర్యటన కూడా రద్దయి నట్లు శుక్రవారం రాత్రి మీడియాకు సమాచారం అందింది. దీంతో ఆయన 29, 30 తేదీల్లో ఢిల్లి పర్యటన ఉండ బోతున్నదంటూ కొత్త ప్రచారం మొద లైంది. వాస్తవానికి ఆయన శుక్ర వారం విశాఖలోని శ్రీ శారదా పీఠం లో జరిగే వార్షికోత్సవ కార్య క్రమాలలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం అనకాపల్లి ఎంపీ బి. సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీలా స్రవంతి దంపతుల ను, విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ కుమా రుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులను, ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయు డు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదిం చాల్సి ఉంది. కానీ, తాజా నిర్ణయంతో ఈ కార్యక్రమా లన్నీ రద్దయ్యాయి.