Friday, November 22, 2024

మూడు నెల‌ల్లో అంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్ వేస్తాం … జ‌గ‌న్

గుంటూరు: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఒక యజ్ఞంలా చేపడుతున్నామని, ఆ యజ్ఞానికి గుంటూరు జిల్లా భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయం నుంచి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు . గుంటూరు జిల్లా భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి చేరుకున్న జగన్‌ అక్కడి కమ్యూనిటీ హాల్‌లో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సాధారణ పౌరుడి మాదిరిగానే రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వ్యాక్సిన్‌ పొందారు. అనంతరం వైద్య సిబ్బంది అబ్జర్వేషన్‌లో ఉన్నారు.. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్‌తో సహజీవనం చేయడం తప్ప వేరే మార్గం లేద‌న్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న ఆయుధం వ్యాక్సినేషన్‌ మాత్రమేన‌ని పేర్కొన్నారు.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉధృతంగా చేపట్టి ప్రజలకు ఆరోగ్య భద్రత మెరుగ్గా ఇవ్వగలుగుతామన్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితంగా దేశానికి కూడా ఆదర్శంగా నిలుస్తామన్నారు. వ్యాక్సినేషన్‌ ఇలా కూడా చేయొచ్చు అని దేశానికి కూడా చెప్పే పరిస్థితి కొద్ది రోజుల్లో జరుగుతుందన్నారు. లోకల్‌ బాడీ ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయని, ఆ 6 రోజుల ప్రక్రియ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపడతామని ‌ జగన్ పేర్కొన్నారు.. మూడు నెల‌లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేస్తామ‌ని చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement