అమరావతి : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలలో గతం కంటే భారీ మెజార్టీతో గెలవాల్సిందేనని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ అన్నారు.. తిరుపతి లోక్ సభ ఎన్నికల వ్యూహం అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి అఖండ విజయమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఎక్కడా అలసత్వం పదర్శించవద్దని హెచ్చరించారు..కాగా,వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి, టిడిపి తరుపున పనబాక లక్షీ బరిలోకి దిగుతుండగా, బిజెపి తన అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది..కాగా ఈ స్థానానికి ఉప ఎన్నికల కోసం 23న నోటిషికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితం వెల్లడికానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement