అమరావతి – అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఎపి ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేడు వ్యాక్సినేషన్ కార్యక్రమం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు… ఈ సందర్భం గా జగన్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఎంత త్వరగా తమ ఉత్పత్తి సామార్ధ్యం పెంచుకోగలిగితే అంత తొందరగా అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని అన్నారు.. మే ఒకటో తేది నుంచి 45 ఏళ్ల పై బడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నామని చెప్పారు.. ఆగస్ట్ నాటికి కొత్తగా 20 కోట్ల డోసుల ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందంటూ, దీనిని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ ఒకటో తేదిని 18 ఏళ్ల పై బడిన వారందరికీ వ్యాక్యినేషన్ వేసే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి వరకూ కొనసాగనుందని అన్నారు… అప్పటి వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమని జగన్ అభిప్రాయపడ్డారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement