అమరావతి – కుటుంబ పెద్ద అకాల మరణం పొందితే ఆ కుటుంబాలను ప్రభుత్వమే మానవతా దృక్పథంతో ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 12,039 కుటుంబాలకు వైయస్‌ఆర్ బీమా సొమ్ము రూ.254 కోట్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు వైయస్‌ఆర్ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నామని, ఏటా రూ.510 కోట్లు ఖర్చు చేసి బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ దాదాపు 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా అందిస్తున్నామని తెలిపారు. అనుకోని ప్రమాదం జరిగి ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉండాలని 2020 అక్టోబర్ 21న వైయస్‌ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటి వరకు మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబాలకు రూ. 254 కోట్లు చెల్లిస్తున్నట్లు సీఎం చెప్పారు. గతంలో మాదిరిగా పీఎంజేజేబీవై (ప్రధాన మంత్రి జన జీవన బీమా యోజన), పీఎంఎస్‌బీఐ (ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన) నుంచి 50 శాతం వాటా లేనప్పటికీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం సొమ్ము చెల్లిస్తూ పథకం అమలు చేస్తోందని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement