అమరావతి: ఎపిలో కరోనా పరిస్థితి రోజు రోజుకి అదుపుతప్పుతున్నది…ప్రతి రోజులు వేలల్లో కరోనా కేసులు నమోదవుతుంటే, మరణాలు కూడా పదుల సంఖ్యలో ఉంటున్నాయి…. దీంతో జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టింది.. 24 గంటలకు పని చేసే కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నది.. అలాగే కరోన నియంత్రంణ తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆరుగురు మంత్రులతో క్యాబినేట్ సబ్ కమిటీని నియమించింది.. ఇక వ్యాక్సిన్, మందులు, ఇంజక్షన్ లు కొరత లేకుండా చూసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు… తాడేపల్లిలోకి క్యాంప్ కార్యాలయంలో నేడు కరోనాపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో వ్యాక్సిన్, ఇంజెక్షన్ లు, మందుల కొరతను జగన్ దృష్టికి తెచ్చారు.. దీనిపై వెంటనే స్పందించిన జగన్ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నభారత బయోటిక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లాతో, రెమిడిసివిర్ ఇంజక్షన్స్ తయారీ సంస్థ హెటిరో డ్రగ్స్ ఎండి పార్థసారధిలతో ఫోన్ లో మాట్లాడారు.. రాష్ట్ర అవసరాలకోసం వ్యాక్సిన్, రెమిడిసివిర్, ఇతర మందులు సరఫరా చేయాలని కోరారు.. అందుకు ఇద్దరు ఎండిలు సానుకూలంగా స్పందించారు…
Advertisement
తాజా వార్తలు
Advertisement