అమరావతి – తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 22 నెలల పరిపాలనా కాలంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును గురించి ఈలేఖలో వివరించారు. కుటుంబంలోని సోదరుడు లేదా అక్కచెల్లెమ్మకు ఈ లేఖను నేరుగా రాశారు. వైయస్‌ఆర్ సున్నావడ్డీ, వైయస్‌ఆర్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైయస్‌ఆర్ చేయూత, వైయస్‌ఆర్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. గ్రామాలు, నగరాలు, వైద్యం, విద్యారంగాలు, వ్యవసాయం, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈలేఖల్లో ప్రస్తావించారు. 22 నెలల పరిపాలనలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శినికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని తెలియజేశారు. తిరుపతి ఉప ఎన్నికలో ఫ్యాను గుర్తుపై ఓటువేసి వైయస్‌ఆర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలంటూ ఆయా కుటుంబాలను లేఖల ద్వారా అభ్యర్థించారు. ఈ లేఖలను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా కుటుంబాలకు పంపిణీ చేయనున్నాయి.
తిరుపతి లోక్ సభ ఓటర్లకు జగన్ బహిరంగ లేఖ…
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement