Tuesday, September 17, 2024

సెజ్లో పేలుడు – జగన్ దిగ్భ్రాంతి

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి -రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలనిఅలాగే చనిపోయిన కార్మికులకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి– హోంమంత్రి అనిత

ఈ ప్రమాదం జరగడంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన విచారాన్ని వ్యక్తం చేశారు.ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు.పరిశ్రమలలో వరస ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రమాదం పై విచారణ చేపట్టాలి– ఎంపీ సీఎం రమేష్

ప్రమాద ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అధికారులను ఆదేశించారు.అనకాపల్లి జిల్లా సంబంధిత అధికారులతో ఇప్పటికే ఆయన ఫోన్లో మాట్లాడారు.ఫార్మా ప్రమాదంతో ఆయన పూర్తిస్థాయిలో ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.ఆసుపత్రి అలాగే ఘటన స్థలి దగ్గర నాయకులు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

దురదృష్టకర ఘటన– కార్మికశాఖ మంత్రి సుభాష్

రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి సుభాష్ అన్నారు. భారీగా పొగవల్ల సహాయక చర్యలకు ఆటంకమేర్పడిందని తెలిపారు. ఘటనాస్థలిలో కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మృతుల వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement