Tuesday, November 26, 2024

వ్యాక్సిన్ సెంటర్లలో ఏర్పాట్లు సంతృప్తికరం – జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నీరద..

తెనాలి :తెనాలిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందని పబ్లిక్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నీరద తెలిపారు. పట్టణంలోని రెండు సెంటర్లలో వ్యాక్సిన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్ జరుగుతున్న తీరును గమనించి వైద్యులు వైద్య సిబ్బంది,ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.అనంతరం సాలిపేట లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ పట్టణంలో సరైన విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ ప్రక్రియను సిబ్బంది సక్రమంగా చేపట్టడం సంతోషకరమన్నారు. వ్యాక్సిన్ రెండో డోస్ కు అర్హత కలిగినవారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు వారికి కేటాయించిన సమయంలోనే వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ నీరద సూచించారు. కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement