Tuesday, November 26, 2024

House Arrest : పల్నాడు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. కొనసాగుతున్న టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ.ఆంజనేయులు హౌస్ అరెస్టు
వినుకొండ: పల్నాడు జిల్లా మాచర్ల లో నిన్న టిడిపి – వైసిపి వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇరువర్గాల కార్యకర్తలు గాయపడగా పట్టణంలో అల్లర్లు జరగకుండా 144 సెక్షన్ విధించిన పోలీసులు. ఈ సంఘటన పై నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చలో మాచర్ల కు పిలుపు నివ్వడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఇతరులు ఏవరు మాచర్ల నియోజకవర్గంలోకి రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జివి. ఆంజనేయులును హౌస్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద బాబు గృహ నిర్బంధం
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి డా.. చదలవాడ అరవింద బాబును పోలీసులు గృహ‌ నిర్బంధం చేశారు. ఛ‌లో మాచర్లకు డా.. చదలవాడ పిలుపుచ్చారు. దీంతో పార్టీ కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నేతలు మాచర్ల వెళ్తారని సమాచారంతో పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు.

గుంటూరులో నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కోవెలమూడి రవీంద్ర, సత్తెనపల్లిలో కోడేల శివరాం, చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పొన్నూరులో దూల్లిపాళ్ల నరేంద్ర తదితరులను పోలీసులు గృహ నిర్బంధo చేశారు. మరికొంత మంది టిడిపి నేతలను మాచర్ల వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement