Saturday, November 23, 2024

పల్నాడు సన్నాలు .. దండిగా ధరలు

భారీ డిమాండ్‌తో లాభాలు శ్రీ విదేశాలకు సన్నరకాలు ఎగుమతి
పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి తమిళనాడు వ్యాపారుల కొనుగోలు
75 కిలోల బస్తా ధాన్యం రూ.1650 నుంచి రూ.1800 వరకు ధర ఉంది
ధర ఇంకా పెరిగే ఆవకాశముందంటున్న వ్యాపారులు

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: పల్నాడు జిలకర సన్నాలు బియ్యానికి డిమాండ్‌ పెరగడంతో ధాన్యం రేటు రైతులు ఆశించిన ధరకు అమ్ముడుపోతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు, డెల్టా ప్రాంతంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సన్నరకాలను ఎక్కువగా సాగుచేశారు. దిగుబడి కూడా ఆశజనకంగా ఉండడంతో సన్నరకాల కోసం తమిళ నాడు వ్యాపారులతో పాటు, తెలంగాణ, రాజమండ్రి, విశాఖ పట్నం నుంచి వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఉమ్మడి జి ల్లాకు వస్తున్నారు. దేశం నుంచి ధాన్యం విదేశాలకు ఎగు మతి చేయడానికి అవకాశం కల్పించడంతో బియ్యం ఎగుమ తులు పెరిగాయి. అనేక దేశాల నుంచి సన్నరకాలకు డిమాండ్‌ ఉం డటంతో ఈ ఏడాది ఎగుమతులు బాగున్నాయని వ్యాపా రు లు చెబుతున్నారు. దీనికితోడు ఈ ఏడాది దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో దిగుబడులపై ప్రభావం పడింది. దీంతో సన్నరకాల ధాన్యానికి దేశీయంగా కూడా డిమాండ్‌ పె రిగింది. పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి ఎక్కువగా త మిళనాడు వ్యాపారులు ఈసారి కొనుగోలు చేస్తున్నారు. ధర లు మరింత పెరుగుతాయన్న అంచనాతో వ్యాపారులు ప్ర స్తు త ధరకు పోటీ-పడి కొనుగోలు చేసి నిల్వలు పెంచుకుంటు-న్నా రు. మరోవైపు రాజమండ్రి, విశాఖపట్టణం తదితర పట్ట ణాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తు న్నారు.

కర్షకులకు కలిసొచ్చిన ధర
ఖరీఫ్‌ సీజన్లో వరి పంటలో సన్నరకాలు సాగు చేసిన కర్షకులకు ధర కలిసివస్తోంది. బహిరంగ మార్కెట్లో రోజు రోజుకు ధర పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సన్నరకాలకు డిమాండ్‌ ఉండటంతో తేమ శాతంతో సంబంధం లేకుండా కోత కోసిన వెంటనే ధాన్యాన్ని పొలాల్లోనే వ్యాపారులు పోటీ-పడి కొనుగోలు చేస్తున్నారు. రకాలను అనుసరించి 75 కిలోల బస్తా ధాన్యం రూ.1650 నుంచి రూ. 1800 వరకు కొంటు-న్నారు. పొలంలోనే కొను గోలు చేస్తుండటంతో రైతుకు గోతం, రవాణా, కూలీ ఖర్చులు సైతం వెచ్చించాల్సిన అవసరం లేదు. దీంతో రైతులు పొలా ల్లోనే విక్రయించడానికి మొగ్గుచూపుతున్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్న దృష్ట్యా కొందరు రైతులు నిల్వ చేసుకొ వడానికి ఆసక్తి చూపుతున్నారు. ధాన్యం సన్నరకాలకు మద్ద తు ధర కంటే అధిక ధరకు ప్రైవేటు- వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వంఎ గ్రేడ్‌ ధాన్యం క్వింటాలు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 చొప్పున ధరలు ప్రకటించింది. 75 కిలోల బస్తా ఎ గ్రేడ్‌ రకానికి రూ.1545, సాధా రణ గ్రేడ్కు రూ.1530 ధరలు ఉన్నాయి. ఇంతకు మించి బహిరంగ మార్కెట్లో 75 కిలోల బస్తా ధాన్యం రూ. 1650 నుంచి రూ.1800 వరకు కొనుగోలు చేస్తున్నారు. జిలకర సన్నాలు, జేజీఎల్‌-384, బీపీటీ- 5204 రకాలకు మంచి డిమాండ్‌ ఉంది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం తోపాటు- రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి వ్యాపారులు పల్నాడు ప్రాంతానికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
సన్నరకాల ధాన్యం కొరత ఉండటంతో పొలంలో రైతు కోత కోస్తున్న సమాచారం తెలుసుకుని అక్కడికే వెళ్లి యం త్రం నుంచి వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజక వర్గం శావల్యాపురం తదితర మండ లాల్లో కోత కోసం కుప్పలు వేసి 15 రోజుల తర్వాత నూర్పిడి చేసిన వా రికి 75 కిలోల బస్తాకు రూ. 2వేల కు పైగా చెల్లిస్తామనివ్యాపారులు ముందుగానే ఒప్పందాలు చేసుకోవడానికి వస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో తగ్గిన వరిసాగు
ఉమ్మడి గుంటూ రుజిల్లాలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గింది. గుంటూరు జిల్లాలోని డెల్లా పరిధిలో పొన్నూరు, చేబ్రోలు, తెనాలి, కొల్లిపర, మంగళ గిరి, తాడేపల్లి, పెదకాకాని, తాడికొండ మండలాల్లోనే వరి సాగు ఉంది. మిగతా మండలాల్లో మెట్ట పంటలు వేశారు. పొన్నూరు, చేబ్రోలు, కొల్లిపర, తెనాలిలోనే అత్యధికంగా వరి సాగు ఉండగా మిగతా నాలుగు మండలాల్లో పాక్షికంగా ఉంది. రెండు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు పౌరసరఫరాల శాఖ 16 వేల టన్నుల బియ్యం సేకరించినట్టు- తెలిసింది. ప్రధానంగా తెలంగాణ నుంచి ఎక్కువ మంది వ్యాపారులు తెనాలి ప్రాంతానికి వచ్చి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి వెళ్లారు. కనీస మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తా రూ.1575 రావాల్సి ఉండగా రూ.1600 వరకు నగదు ఇచ్చి కొనుగోలు చేయడం వల్ల రైతులు వ్యాపారులకు నేరుగా విక్రయించుకుంటు-న్నారు.
గుంటూరు జిల్లాలో ఈ ఏడాది లక్షా 70 వేల ఎకరాల్లో, పల్నాడు జిల్లాలో లక్షా 12 వేల ఎకరాల్లోనే వరి సాగైంది. రెండు జిల్లాల మీద 2.82 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా 9 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది గుంటూరు జిల్లాలో కేవలం 37 వేల మెట్రిక్‌ టన్నులు, పల్నాడు జిల్లాలో 61 వేల మెట్రిక్‌ టన్నులను లక్ష్యంగా ప్రభుత్వం నిర్ధేశించింది. అయితే సేకరించిన బియాన్ని పౌరసరఫరాల శాఖ రేషన్‌ దుకాణాలు, ఎమ్‌డియు వాహనాల ద్వారా బియ్యం కార్డు లకు సరఫరా చేయాల్సి ఉంది. ప్రతి నెలా 20 వేల టన్నులు అవసరం కాగా ఏటా 2.40 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉంది. రెండు జిల్లాల మీద కలిపి 98 వేల టన్నుల బియ్యం సేకరించను న్నారు. రెండు జిల్లాల నుంచి 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా మొత్తం ఉత్పత్తిలో ఆర్‌బికేల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరించేది కేవలం 98 వేల టన్నులు మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

సాగర్‌ ఆయకట్టులో సన్నరకాల సాగు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్‌ ఆయ కట్టు- పరిధిలో 2.47 లక్షల ఎకరాలు మాగాణి భూములు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వరి సన్నరకాల పంటలు సాగుచేశారు. ఈ ఏడాది ఆయకట్టు- చివరి భూముల్లో రైతులు ఆరుతడి పంటలకు మొగ్గుచూపడంతో వరి సాగు విస్తీర్ణం ఏటాతో పోల్చితే ఈసారి కొంతమేరకు తగ్గింది. అయితే సాగు చేసిన రైతులకు మాత్రం దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయి. ఎకరాకు 75 కిలోల బస్తాలు సగటు-న 35 నుంచి 40 వరకు దిగుబడులు వస్తున్నాయి. సాగర్‌ కుడికాలువ కింద పల్నాడు, గుంటూరు జిల్లాల్లో వరి సాగు ఉంది. ధాన్యం దిగుబడులు చేతికొచ్చే తరుణంలోనే ధరలు ఆశాజనకంగా ఉండటం అన్నదాతలకు కలిసివస్తోంది. గత ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం దిగుబడులు ఇంటికి వచ్చినప్పుడు బస్తా (75కిలోలు) రూ.1250 నుంచి రూ.1300 వరకే ధర లభించింది. ప్రస్తుతం వ్యాపారులు చేలల్లోనే తేమ శాతంతో పని లేకుండా ధాన్యం కొంటు-న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement