అమరావతి – ఎపిలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించాలని ఏపీ సర్కారుకి హైకోర్టు సూచించింది. కరోనా విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో లక్షలాది విద్యార్ధుల జీవితాలను రిస్క్ లో పెట్టవద్దని కోరింది.. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించడంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ లను నేడు హైకోర్టు విచారించింది.. పరీక్షల నిర్వహణ పట్ల అటు విద్యార్ధులోనూ, ఇటు తల్లిదండ్రులలోన ఆందోళనలు నెలకొన్నాయని పిటిషనర్ లు కోర్టు దృష్టికి తెచ్చారు.. ఇప్పటికే పలు రాష్ట్రాలలో పరీక్షలను రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేశారని వివరించారు..అయితే కొవిడ్ జాగ్రత్తలు అన్ని తీసుకుని పరీక్షలు నిర్వహించనున్నామని ప్రభుత్వం హైకోర్టుకి విన్నవించింది.. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని సూచిస్తూ విచారణను మే మూడో తేదికి వాయిదా వేసింది. కాగా 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు , జూన్ 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు . పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఆయా బోర్డులు షెడ్యూల్ ప్రకటించాయి.. ఇప్పటికే ఇంటర్ హాల్ టిక్కెట్లను కూడా జారీ చేశారు..ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement