బాపట్ల కోవిడ్ జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ కు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని జిల్లా సబ్ కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కోవిడ్ నియంత్రణపై పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ సభలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ప్రాంతాలలో వార్డు సచివాలయంలో,గ్రామ సచివాలయ లో ప్రతి ఒక్క ఉద్యోగి ప్రజలలో చైతన్యం కలిగించి కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ వేయించాలన్నారు. వ్యాక్సినేషన్ పై సిబ్బంది ప్రజలలో మరింత అవగాహన కల్పించి ఇచ్చిన టార్గెట్ ప్రకారం వ్యాక్సిన్ వేయించ కపోతే సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు.చిన్న పాటి నిర్లక్ష్యం వలన ఎన్నో ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, గమనించి వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత ప్రజలలో వివరించి వేయించాలన్నారు. ఇప్పటివరకు వేసిన వ్యాక్సిన్ వలన ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగలేదని పేర్కొన్నారు.ముఖ్యంగా ప్రతి ఒక్క వాలంటీర్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచనలు చేయడంతో పాటు,ఒక్కటి కూడా వృధా కాకూడదు అన్నారు.జిల్లాలో ఆరు లక్షల ఆరు వేల మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా,ప్రస్తుతం రెండు లక్షల 25 వేల మందికి మాత్రమే చేయడం జరిగిందన్నారు.పోలీస్, రెవెన్యూ,రెవిన్యూ,మెడికల్,తదితర శాఖల ఉద్యోగులు అందరికి కూడా 90% పూర్తయిందని,మిగిలిన 10 శాతం ఉద్యోగులు వ్యాక్సిన్ వేసుకోవాలి అన్నారు.జిల్లాలో మంగళగిరి,రేపల్లె, నరసరావుపేట,తాడేపల్లి తదితర ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముందంజలో ఉందని మిగిలిన ప్రాంతాలలో కొంత వెనుకబడి ఉందన్నారు త్వరితగతిన అన్ని ప్రాంతాలలో ప్రజలకు అధికారులు వ్యాక్సినేషన్ వేయించి కరోనా వైరస్ కు దూరంగా ఉంచాలని వివరించారు.వ్యాక్సిన్ వేసుకోవడం వలన ఇబ్బందులు కలుగుతాయని సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ప్రజలెవరూ నమ్మవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ వల్ల ఏ ఒక్కరికి కూడా హాని కలగకూడదని లక్ష్యంతో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేస్తున్నాయన్నారు.అనంతరం వన్ టు మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.ఈ నెల 11,12,13,14 తేదీలలో జరిగే వ్యాక్సినేషన్ పండుగ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాయుర్ అశోక్, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్,డిఎంహెచ్ఓ యాస్మిన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ నరసింహనాయక్,జిల్లా క్షయ నివారణ అధికారి రమేష్, తహసిల్దార్ శ్రీనివాస్,ఎంపీడీవో రాధాకృష్ణ,సివిల్ సప్లెయ్ డిప్యూటీ తహశీల్దార్ ఓంకార్,ఆర్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అపోహలు నమ్మకండి – ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోండి
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement