Monday, November 18, 2024

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్: డీజీపీ సవాంగ్

గుంటూరులో సంచలనం సృష్టించిన బీటెక్‌ స్టూడెంట్ రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. రమ్య హత్య ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా నిందితుడిని గుర్తించామని డీజీపీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికుల సమాచారం అత్యంత కీలకమైందని ఆయన తెలిపారు. ఆ సమాచారం ఆధారంగానే నిందితుడిని తొందరగా పట్టుకున్నామన్నారు. నిందితుడిని గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సామాజిక మాధ్యమాలలో ఏర్పడే పరిచయాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సవాంగ్ సూచించారు. యువతులు, మహిళలపై దాడులకు పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు. ఇటువంటి దాడులను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేసిన గుంటూరు అర్బన్‌ పోలీసులను డీజీపీ అభినందించారు. మహిళల రక్షణకు అహర్నిశలు శ్రమిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా రమ్య మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి డెడ్‌బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా రమ్య మృతదేహం తరలిస్తున్న వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రమ్యను హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది.

ఈ వార్త కూడా చదవండి: రేప్ చేయిస్తానంటూ కూతురిని బెదిరించిన కన్నతండ్రి

Advertisement

తాజా వార్తలు

Advertisement