ఏపీలో ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా నడవడం లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ అన్నారు. ఆదివారం తిరుపతిలో సిఐటియు ఆధ్వర్యంలో “ప్రజా ఉద్యమాలు-నిర్బంధం”పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ, సిఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.నరసింహారావు హాజరయ్యారు. ఈ గోపాలగౌడ మాట్లాడుతూ ఏపీలో కార్మికులు, ప్రజా సమస్యలపై నిర్బంధంపై ఇది ప్రజా ప్రభుత్వమేనా? అన్న అనుమానంగా ఉందన్నారు. పోలీసు నిర్బంధాలపై కోర్టులలో కేసులు వేయాలని కార్మిక సంఘాలకు సూచించారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచు కోవాలన్నారు. కార్మికులు పనిచేయకపోతే దేశ అభివృద్ధి జరగదని, అలాగే ప్రభుత్వాలు వారి హక్కులను కాలరాయకూడదన్నారు. రైతులు, కార్మికులు ఈ దేశానికి చాలా అవసరమన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement