కొల్లిపర, ఫిబ్రవరి 17, ప్రభా న్యూస్:-మేకల దొంగతనం చేసిన నలుగురు వ్యక్తులను ఎస్ ఐ ఆర్ రవీంద్రారెడ్డి తన సిబ్బందితో కలసి అదుపులో తీసుకున్నారు. ఎస్ ఐ ఆర్ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని మున్నంగి గ్రామానికి చెందిన మున్నంగి కిట్టారావు మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం నలుగురు వ్యక్తులు పిడపర్తి పాలెం గ్రామానికి ఎదురుగా ఉన్న కృష్ణా నదిలో మేకలు మేపుతూ ఉండగా నలుగురు దుండగులు తన వద్దకు వచ్చి మత్తు మందు పెట్టి తన రెండు కాళ్లు చేతులు కట్టి పడవేసి గుర్తు తెలియని వ్యక్తులు తన మేకలను నాలుగు చక్రాల వాహనంలో ఎక్కించుకొని వెళ్లారని మేకలు నాలుగు లక్షల అరవై వేల రూపాయలు విలువ కలిగినవి అని ఫిర్యాదు చేసిన సందర్భంలో తమ సిబ్బందిని అప్రమత్తం చేసిన ఎస్ఐ ఆర్ రవీంద్రారెడ్డి. కొల్లూరు మండల గ్రామానికి చెందిన స్థానిక సుగాలి కాలనీకి చెందిన బాణావత్ హజయ్య నాయక్ వయసు 48 సంవత్సరాలు, బాణావతి రామకోటయ్య నాయక్ వయసు 45 సంవత్సరాలు ఇద్దరు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన కేటీ కాలనీలో నివసించే మాణిక్యాల బ్రహ్మయ్య వయసు 21 సంవత్సరాలు, తుపాకుల లోకేష్ వయసు 24 సంవత్సరాలు మరో ఇద్దరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు వీరి వద్దనుండి నాలుగు లక్షల రూపాయల నగదును, హీరో హోండా బైక్ ను, అశోక్ లైలాండ్ నాలుగు చక్రాల వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ స్రవంతి రాయ్ మాట్లాడుతూ గ్రామాలలో దొంగతనాలకు పాల్పడే వ్యక్తుల పై పోలీసుల నిఘా నేత్రాలు వెంటాడుతూనే ఉంటాయి అన్నారు. దొంగతనాలు చేస్తే ఎవరూ పట్టుకోలేరని అనుకోవద్దని హెచ్చరించారు. ప్రజలకు కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తులకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కె శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ ఆర్ రవీంద్రారెడ్డి, ఏ ఎస్ ఐ పోతురాజు, బి శ్యాం కుమార్ హెడ్ కానిస్టేబుల్ రైటర్, జి వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ ఎం కూర్మారావు బి తాతారావు ఆర్ రాజేష్, వెంట ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement