Thursday, November 21, 2024

బాపట్లలో గుప్పుమంటున్న గంజాయి

బాపట్ల టౌన్ – గుట్టుచప్పుడుగా పట్టణంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి.మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డ యువకులు చీరాల పరిసర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకు వచ్చి పట్టణ,మండల ప్రాంతాలలో దొంగ చాటుగా తాగుతున్నారు.ఇటీవల పట్టణంలో గంజాయి విక్రయాలు చేస్తున్న ఇరువురు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రెండు రోజులు ప్రసంతంగా ఉన్న యువకులు గంజాయి కోసం పరితపిస్తూ ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి,పెయింటర్స్ కాలిని పార్కు వెనక వైపు ఉన్న ముళ్లపొదల్లో,బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని డ్రెయిన్లపై,రైలుపేట ప్రాంతంలో ఈస్ట్ స్టాంప్ డ్రెయిన్ వద్ద ఉన్న ముళ్ల పోదాలను అడ్డాగా మార్చుకొని విక్రయాలతో పాటు,గంజాయి సేవించడానికి అడ్డాగా మార్చుకుంటున్నారు.చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళవలసిన విద్యార్థులు మాదకద్రవ్యాలు అలవాటు పడి బంగారం లాంటి జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నరని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గతంలో అధికంగా కార్మికులు మాదకద్రవ్యాలకు అలవాటు పడి,పని చేసిన తరువాత వచ్చిన డబ్బులతో కొనుగోలు చేసి సేవించేవారు.అయితే ప్రస్తుతం విద్యార్థులకు గంజాయి ఒక ట్రెండ్ ల మార్చుకొని ఓంటిపై ఉన్న బంగారు వస్తువులు షాపులలో తాకట్టు పెట్టి మరి అధిక సంఖ్యలో విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో అర్థమవుతుంది.విద్య కేంద్రంలో లాంటి తులసి వనంలో గంజాయి గుప్పుమనడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement