Tuesday, November 26, 2024

యూపీహెచ్సీ పరిధిలో “ఫ్రైడే డ్రైడ్” కార్యక్రమం…

మంగళగిరి రూరల్ ఫిబ్రవరి 17 ప్రభ న్యూస్. – మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న.గణపతి నగర్ డాక్టర్ వైయస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో శుక్రవారం హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడ్ కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ సెంటర్ పరిధిలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి నీటి నిల్వలను పరీక్షించారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి డాక్టర్ పీ అనూష మాట్లాడుతూ ఇంటిలో ఫ్రిజ్, నీటి తొట్టెలు, పూల కుండీలు పగిలిపోయిన గ్లాసులు, డబ్బాలలో నిల్వ ఉంచిన నీటిలో దోమలు గుడ్లు పెట్టడం వల్ల దోమలు వృద్ది చెంది డెంగ్యూ, బోదకాలు, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. తొట్టెలలో ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచకుండా తొట్టెలను శుభ్రంగా కడిగి ఎండబెట్టి కొత్తనీరుతో నింపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ, సూపర్వైజర్లు సాగర్, ప్రసాద్, హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి, హెల్త్ సెక్రటరీ, ఆశాలు, మలేరియా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement