Monday, November 18, 2024

రైల్వేలో ఉద్యోగం పేరుతో మోసం.. గుంటూరు జిల్లాలో ఘ‌ట‌న‌..

చేబ్రోలు, (ప్రభన్యూస్): ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో జ‌రిగింది. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన గంగాధర్ రెడ్డి 2017 నుండి రైల్వేశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతను పనిచేసే విభాగంలోనే పగడాల శ్రీనివాసరావు కూడా పని చేస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో పగడాల శ్రీనివాసరావు రైల్వే శాఖలో పర్మినెంటు ఉద్యోగం ఇప్పిస్తానని గంగాధర్ రెడ్డితో నమ్మబలికాడు.

ఈ మాటలు నమ్మిన గంగాధర్ రెడ్డి రూ.1.60ల‌క్ష‌లు శ్రీనివాసరావుకు ఇచ్చాడు. అయితే జాబ్ ఎంత‌కీ ప‌ర్మినెంట్ కాక‌పోవ‌డం, అత‌ను చెప్పిన మాట‌లు నిజాలు కాద‌ని తెలుసుకున్నాడు. చాలా కాలం తర్వాత తాను మోసపోయానని గ్రహించిన గంగాధర్ రెడ్డి, శ్రీనివాసరావుపై చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేబ్రోలు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement