గుంటూరు, ప్రభన్యూస్ బ్యూరో : తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి జెఆర్ పుష్పరాజ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పరాజు గురువారం సాయంత్రం వైద్యశాలలో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. పుష్పరాజు .ఎన్టీఆర్ , చంద్రబాబు హయాంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. పుష్ప రాజు టిడిపి ఆవిర్బావం నుంచి తుది శ్వాస విడిచేవరకు పార్టీలో కొనసాగారు.
అధ్యాపక వృత్తిని వదిలి స్వర్గీయ ఎన్టిఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా అనేక పథకాలకు పుష్పరాజ్ నాంది పలికారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారు. ఏపీ ఫుడ్ కమిషన్ చెర్మన్‌గా ప్రజలకు విశేషమైన సేవలందించారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని చంద్రబాబునాయుడు అప్పట్లో కొనియాడారు. ఆయన కుటు-ంబ సభ్యులకు, అభిమానులకు మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పలువురు జిల్లా టీడీపీ నేతలు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.