Saturday, November 23, 2024

కెఎల్ యులో గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ పుడ్ ప్రోసెసింగ్ టెక్నాలజీ పై వర్క్ షాపు

తాడేపల్లి,ఫిబ్రవరి19(ప్రభ న్యూస్) – ఆహార పదార్థాల శుద్ది మరియు ఉత్పత్తి ప్రక్రియ గురించి విద్యార్థులకు వివరించేందుకు కెఎల్ విశ్వవిద్యాలయం లోని పుడ్ టెక్నాలజీ విబాగం వారు ఒక రోజు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెఎల్ యు పుడ్ టెక్నాలజీ విబాగ అధిపతి డాక్టర్ కె.శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎఎం అహ్మదాబాద్ నుండి పట్టా పొంది సింగపూర్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓలం ఫుడ్స్ సంస్థలో ఉద్యోగిగా సమర్థ వంతంగా విధులు నిర్వహిస్తున్న బత్తినేని రామకృష్ణ ఆన్ లైన్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆహార ఉత్పత్తుల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రపంచ స్థాయిలో ఆహార పదార్ధాల శుద్ది, ఉత్పత్తి ప్రక్రియ మరియు మార్కెటింగ్ లలో ఎదురయ్యే సవాళ్లు గురించి, వివరించారు.


కాఫీ ఉత్పత్తులు, ఓరియో బాస్కెట్ ల తయారీ ప్రక్రియ గురించి విద్యార్థులకు వివరించారు. పదార్థాలు మరియు కొత్త ఉత్పత్తి పరిష్కారాలను అందించడానికి వినియోగదారు బ్రాండ్‌లతో తాము ఏవిదంగా భాగస్వామ్యం చేస్తారో వివరించారు.ముందుగా సరఫరా గొలుసును వివరించిన ఆయన జీడిపప్పును పండుగా ఎలా పండిస్తారు, జీడిపప్పుకు ఎలా ప్రక్రియ చేస్తారు అనే పలు అంశాలపైన విద్యార్దులకు అవగాహన కల్పించారు.
పుడ్ టెక్నాలజీ, వ్యవసాయ విబాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ, ప్రో.విసి డాక్టర్ ఎన్.వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement