Wednesday, November 20, 2024

ఎన్ ఆర్ ఐ హాస్ప‌ట‌ల్ ఎండికి బెదిరింపులు – ఆల‌పాటిపై కేసు న‌మోదు..

గుంటూరు: మాజీ మంత్రి ఆలపాటి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు… ఎన్ఆర్ఐ చైర్మన్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రని బెదిరించారని అభియోగంతో ఆలపాటిపై 506, 448, 170/2021 సెక్షన్ల కింద మంగ‌ళ‌గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆల‌పాటిని పోలీసులు ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంది. ఇది ఇలా ఉంటే, జిల్లా టిడిపి సీనియ‌ర్ నేత దూళ్లిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్ ను ఆల‌పాటి ఖండించారు…. తెనాలిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, జగన్ రెడ్డి రెండేళ్ల పాలన మూడు కేసులు, ఆరు అరెస్టులుగా ఉందని వ్యాఖ్యానించారు. పాలించడం చేతగాని వాడికి పగ్గాలు అప్పగిస్తే పాలన ఇలానే ఉంటుందన్నారు. సమస్యలను ప్రశ్నించిన ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ అరెస్టులు, కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. దూళ్లిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ఒక బందిపోటును అరెస్ట్ చేసినట్లుగా వందల మంది పోలీసులతో నరేంద్రను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. వేధించి కోడెల శివప్రసాద్‌ను బలిగొన్నారని… అలానే అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, దేవినేని ఉమా, దూళ్లిపాళ్ల నరేంద్రలపై కుట్ర పూరితంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement